ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరికో బస్సు వేసుకురండి!

ABN, First Publish Date - 2021-10-19T05:04:12+05:30

వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నేతలు ఐక్యంగా పనిచేయాలి 
  • ప్లీనరీ, విజయగర్జన సభ ఏర్పాట్లపై కేటీఆర్‌ సమీక్ష


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేసేందుకు భారీగా పార్టీ శ్రేణులను తరలించాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి జిల్లా నేతలకు సూచించారు. టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ధి వేడుకల్లో భాగంగా ఈనెల 25న హైటెక్స్‌లో నిర్వహించే ప్లీనరీ, వచ్చేనెల 15న వరంగల్‌లో నిర్వహించే విజయ గర్జన సభ ఏర్పాట్లపై సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో వికారాబాద్‌, తాండూరు, పరిగి, చేవెళ్ల నియో జకవర్గాలకు చెందిన ముఖ్యనేతలతో సన్నాహాక సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ రెండు కార్యక్రమాల నిర్వహణపై నాయకులకు దిశానిర్ధేశం చేశారు. ఈసందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఈ రెండు కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఇందుకోసం పార్టీ నేతలంతా విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని హితబోధ చేశారు. ప్రతిపక్ష విమర్శలను ఎప్పటికపుడు తిప్పికొట్టాలని సూచించారు. వరంగల్‌లో వచ్చేనెల 15న నిర్వహించే విజయగర్జనకు భారీగా పార్టీ శ్రేణులను తరలించాలని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు స్థానిక నాయకత్వం పకడ్బందీగా చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఊరి నుంచి ఒక బస్సులో జనాలను తరలించాలని, అలాగే ప్రతి వార్డు నుంచి ఒక బస్సు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, ప్రశాంత్‌రెడ్డి, రాజ్యసభసభ్యులు కేశవరావు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యేలు కాలె యాదయ్య, మహేష్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌ తదితరులు  పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-19T05:04:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising