ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్తేపూర్‌ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2021-02-27T04:28:29+05:30

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం, బస్తేపూర్‌ సర్పంచ్‌ బ్యాగరి నర్సింహులు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం, బస్తేపూర్‌ సర్పంచ్‌ బ్యాగరి నర్సింహులు, ఉప సర్పంచ్‌ పట్లోళ్ల దామోదర్‌రెడ్డి సస్పెన్షన్‌కు గురయ్యారు. గ్రామంలో అభివృద్ధిని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నారని, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీల నిర్మాణంలో తీవ్ర జాప్యం వహిస్తున్నారని దిన పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం విచారణలో నిర్దారణ కావడంతో తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018 సెక్షన్‌ 37(5) ప్రకారం సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లను మూడు నెలలపాటు సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఉత్తర్వులు (801/2021ఎ-(పం)-4, 5 జారీ చేశారు. ఈ ఉత్తర్వులపై ఏవైనా అభ్యంతరం ఉంటే 30రోజుల్లో పంచాయతీ ట్రిబ్యునల్‌లో అప్పీలు చేసుకోవచ్చని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 


ఉప సర్పంచ్‌ రాజీనామా

యాచారం : మండల పరిధిలోని తక్కళ్లపల్లి తండా గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. గ్రామ ఉపసర్పంచ్‌ విజయ్‌నాయక్‌పై వార్డుసభ్యులు అవిశ్వాసం ప్రక టిస్తూ వారం క్రితం ఆర్డీవోకి వినతిపత్రం అంద జేశారు. కాగా శుక్రవారం ఉదయం 12గంటలకు అవిశ్వాసం తీర్మానంపై గ్రామ పంచాయతీలో చర్చ జరగాల్సి ఉండగా.. అంతకుముందే విజయ్‌నాయక్‌ ఈవోఆర్డీ శ్రీలతకు తన రాజీనామా పత్రం అందజేసి పదవి నుంచి తప్పుకున్నారు.


Updated Date - 2021-02-27T04:28:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising