నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
ABN, First Publish Date - 2021-10-22T05:05:54+05:30
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
మాట్లాడుతున్న ఏడీ, ఏవో
తాండూరు రూరల్: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని తాండూరు వ్యవసాయ శాఖ ఏడీ శంకర్‌రాథోడ్ డీలర్లను హెచ్చరించారు. తాండూరు వ్యవసాయశాఖ కార్యాలయంలో గురువారం ఏవో రజితతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల, పెద్దేముల్, తాండూరు మండలాల్లో రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందజేయాలని డీలర్లకు సూచించారు. కొనుగోలు చేసిన రైతులకు తప్పక రశీదు అందజేయాలన్నారు. సరుకుల పట్ల అవగాహన కల్పించాలని, ఎరువులు, విత్తనాలు ఎంత మోతాదులో వాడాలో తెలపాలని సూచించారు. అధికారులకు అనుమతి పత్రాలు చూపించాలని కల్తీ ఎరువులు అమ్మితే లైసెన్స్ రద్దుచేస్తామని వారు హెచ్చరించారు.
Updated Date - 2021-10-22T05:05:54+05:30 IST