ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రాభివృద్ధి : మంత్రి

ABN, First Publish Date - 2021-09-18T05:00:27+05:30

టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రాభివృద్ధి : మంత్రి

మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరిన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకువెళుతోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువులు నాయకులు టీఆర్‌ఎ్‌సలో చేరారు. మంత్రి వారికి టీఆర్‌ఎస్‌ కండుకాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, మండల కార్యదర్శి దత్తుగౌడ్‌, వార్డుసభ్యులు సుధాకర్‌, భూపాల్‌రెడ్డి, వీరితోపాటు గుండ్లపోచంపల్లి 14వ వార్డు కౌన్సిలర్‌ హేమంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ మండల ఉపాధ్యక్షుడు ప్రకా్‌షరెడ్డి, సంజీవరెడ్డిలు, తదితరులు టీఆర్‌ఎ్‌సలో చేరారు.

టీఆర్‌ఎస్‌ గ్రామ కమిటీ ఏర్పాటు

ఘట్‌కేసర్‌ రూరల్‌/మేడ్చల్‌/ఘట్‌కేసర్‌ : టీఆర్‌ఎస్‌ ఘట్‌కేసర్‌ మండలం కొర్రెముల గ్రామశాఖ అధ్యక్షుడిగా కుర్రి ఆనంద్‌, ప్రధాన కార్యదర్శిగా పోలగోని రాములుగౌడ్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని మంత్రి మల్లారెడ్డి నివాసంలో అధ్యక్ష, కార్యదర్శులను మంత్రి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో నాగరాజు, యాదగిరి, ఆంజనేయులు, నాగేష్‌, మహేంద్రచారి, తదితరులు ఉన్నారు. అలాగే మేడ్చల్‌ మండలం పూడూరు గ్రామానికి చెందిన సత్తిబాబుకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన రూ.60 వేల చెక్కును మంత్రి చేతులమీదుగా లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రఘు, నాయకులు జగన్‌రెడ్డి, మద్దుల శ్రీనివా్‌సరెడ్డి, సింహాలుయాదవ్‌ తదితరులు ఉన్నారు. కాగా, కీసరగుట్ట దేవస్థాన కమిటీ సభ్యుడిగా నియమితుడైన ఘట్‌కేసర్‌కు చెందిన మెరుగు నరే్‌షగౌడ్‌ శుక్రవారం మంత్రి మల్లారెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానని నరే్‌షగౌడ్‌ విలేకర్లకు వివరించారు.

Updated Date - 2021-09-18T05:00:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising