ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఎస్పీ

ABN, First Publish Date - 2021-10-29T04:47:38+05:30

గంజాయి నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డీఎస్పీ

సిబ్బందితో మాట్లాడుతున్న డీఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డీఎస్పీ సత్యనారాయణ 


బంట్వారం (కోట్‌పల్లి): గంజాయి నివారణపై పోలీసులు ప్రత్యేకశ్రద్ధ వహించాలని డీఎస్పీ సత్యనారాయణ సూచించారు. కోట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ను  గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. పోలీస్‌ సిబ్బందితో మాట్లాడుతూ కోట్‌పల్లి  మండలంలోని అన్ని గ్రామాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని, ఎక్కడైన గంజాయి పండిస్తున్నట్లు, రవాణా చేస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా పంట పొలాలు, దుకాణాలు, పాన్‌షాపులు, అనుమానిత వ్యక్తులపై నిఘాఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ ఆనంద్‌, ట్రైనింగ్‌ మహిళా ఎస్‌ఐ మాధవి, పోలీస్‌ సిబ్బంది శివయ్య, నర్సింహారెడ్డి  పాల్గొన్నారు. 

కిరాణాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీ 

తాండూరు/ధారూరు: తాండూరు పట్టణంలోని వివిధ కిరాణా దుకాణాలను గురువారం సాయంత్రం తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ, సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ గిరి, పోలీసు సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు చేశారు. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా వివిధ షాపుల్లో గుట్కా, ఓబీసీ పేపర్స్‌, గంజాయి వంటి పదార్థాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. ధారూరు గ్రామంలోని 14కిరాణ దుకాణాలలో గురువారం సాయంత్రం సీఐ తిరుపతి రాజు, పోలీసు సిబ్బంది అకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో మత్తు పదార్ధాలు లభ్యం కాలేదని సీఐ తిరుపతి రాజు తెలిపారు. ఎస్‌ఐలు సుస్మిత, రాజు, శైలజా, ఎఎస్‌ఐ మురళీ, సిబ్బంది పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-29T04:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising