ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అండగా నిలవాలి

ABN, First Publish Date - 2021-05-19T05:11:37+05:30

అండగా నిలవాలి

కందుకూరు మండలం దాసర్లపల్లిలో నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్న సర్పంచ్‌ బాలమణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు/తలకొండపల్లి/మాడ్గుల: కరోనా బాధితులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని దాసర్లపల్లి సర్పంచ్‌ బాలమణిఅశోక్‌ కోరారు. కరోనా సోకిన వారికి మంగళవారం నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో బాలింతలకు పౌష్టికాహారం అందజేశారు. దెబ్బడగూడలో సేవాభారతి ఆధ్వర్యంలో కరోనా సోకిన కుటుంబాలకు చికెన్‌ పంపిణీ చేశారు. ఇప్పటికే నిత్యావసర సరుకులను పంపిణీ చేశామని కార్యకర్త కె.మహేష్‌ తెలిపారు. జిట్ట రవీందర్‌రెడ్డి, ఎ.మనోహర్‌, బండ ఐలయ్య, బి.సురేష్‌, మహేష్‌, మల్లేష్‌ శ్రీను, లోకేష్‌, ప్రశాంత్‌, సురేష్‌, పాల్గొన్నారు. తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో కరోనా బారిన పడిన వారికి ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, తలకొండపల్లి జడ్పీటీసీ వెంకటేశ్‌ ఐసోలేషన్‌ మెడికల్‌ కిట్లు సరఫరా చేయగా ఎంపీటీసీ అంబాజీ, ఉపసర్పంచ్‌ అజీజ్‌ అందజేశారు. కృష్ణాగౌడ్‌, మల్లేశ్‌, ఆశ కార్యకర్త సరస్వతి పాల్గొన్నారు. కొత్తూర్‌ మండలం ఇన్ముల్‌నర్వలో సర్పంచ్‌ అజయ్‌మిట్టునాయక్‌ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులతో సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేయించారు. గ్రామంలోని ప్రతీ వీధిలో పిచికారీ చేయించామన్నారు. మాడ్గులలో సర్పంచ్‌ జంగయ్యగౌడ్‌, ఎంపీటీసీ లక్ష్మమ్మ గ్రామంలో కొవిడ్‌ రిలీఫ్‌ టీమ్‌ ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో కరోనా పీడితులకు నిత్యవసరాలను అందజేస్తున్నారు. పండ్లు, కూరగాయలు, 10 రకాల కిరాణ వస్తువులు, 30 గుడ్లు ప్రతీ కరోనా బాధితుడికి మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జంగయ్య, ఉపసర్పంచ్‌ రాములు, జంగయ్య, విషు,్ణ శివరాజు, శ్రీకాంత్‌, మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-19T05:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising