షాద్‌నగర్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలి
ABN, First Publish Date - 2021-08-24T04:33:08+05:30
షాద్‌నగర్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలి
- జిల్లా సాధన సమితి సభ్యుల డిమాండ్
షాద్‌నగర్‌అర్బన్: షాద్‌నగర్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఫరూఖ్‌నగర్ డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా కేంద్రాన్ని మారుమూల ప్రాంతమైన కొంగరకలాన్‌లో ఏర్పాటు చేసి షాద్‌నగర్ ప్రాంత ప్రజలను దూరం చేశారని పేర్కొన్నారు. షాద్‌నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు జిల్లా కేంద్రం ఏ మాత్రం అందుబాటులో లేదన్నారు. సీఎం కేసీఆర్ స్పందించి షాద్‌నగర్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సాధన కమిటీ సభ్యులు సంతోష్, శివ, మధు, నవీన్, పాల్గొన్నారు.
Updated Date - 2021-08-24T04:33:08+05:30 IST