ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోరూరించే ‘గేవర్‌’ స్వీట్‌

ABN, First Publish Date - 2021-01-14T03:52:29+05:30

సంక్రాంతి వచ్చిందంటే తాండూరు వాసులకే కాదు.. సరిహద్దులో ఉన్న కర్ణాటక, మన రాష్ట్రంలోని

తాండూరు ఓ హోటల్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న గేవర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తాండూరులో సంక్రాంతికి ప్రత్యేకంగా తయారీ, అమ్మకం
  • పెరిగిన ధరలు.. తగ్గని ఆదరణ 


తాండూరు : సంక్రాంతి వచ్చిందంటే తాండూరు వాసులకే కాదు.. సరిహద్దులో ఉన్న కర్ణాటక, మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలకు గుర్తుకు వచ్చేది తాండూరు ‘గేవర్‌’ స్వీట్‌. సంక్రాంతి స్పెషల్‌ ఐటంగా తాండూరులో 8దశాబ్దాలకు పైగా తయారు చేస్తున్న తీపి వంటకం. ఇది కేవలం సంక్రాంతి సమయంలో మాత్రమే తయారు చేస్తారు. దీంతో హైదరాబాద్‌, విజయవాడ, తిరుపతి, సరిహద్దు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తాండూరు గేవర్‌ కోసం ఆర్డర్లు ఇచ్చి మరీ తీసుకెళ్తారు. ప్రతిఏటా సంక్రాంతి రోజు పిండివంటలతోపాటు తప్పక ఉండాల్సిన తీపి పదార్థం గేవర్‌.  

ఉత్తర భారత దేశంలో ప్రధాన తీపి వంటకమైన గేవర్‌ను తాండూరు పట్టణంలో సుమారు 84ఏళ్ల క్రితం వెలసిన హోటల్లో విక్రయిస్తున్నారు. తరతరాలుగా హోటల్‌ కుటుంబం గేవర్‌ తయారీని ఆనవాయితీగా తయారు చేస్తున్నారు. ఈ స్వీట్‌ను శీతాకాలంలో మాత్రమే తయారు చేయడానికి అనుకూలంగా ఉంటుందని, మిగితాకాలంలో చేయరాదని తయారీ దారులు చెబుతున్నారు. తాండూరు పట్టణం గంజ్‌లోని హన్మప్ప హోటల్‌లో గేవర్‌ స్వీట్‌ లభిస్తోంది. ఉత్తర భారతదేశంలోని రాజస్థానీ వంటకమైన  గేవర్‌ తయారీని హోటల్‌ యజమాని హన్మప్ప నేర్చుకొని తాండూరు ప్రాంతవాసులకు పరిచయం చేశారు. హన్మప్ప మరణా నంతరం కూడా కుటుంబ సభ్యులు గేవర్‌ తయారీని మరవలేదు. దీనిని నెయ్యి (లేదా డాల్డా), మైదా, పంచదారతో తయారు చేస్తారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి మొదటివారం వరకు గేవర్‌ లభ్యమవుతుంది. కొత్త సంవత్సరం మొదలుకొని సంక్రాంతి వరకు గేవర్‌ అమ్మకాలు జోరుగా జరుగుతాయి. నాలుగేళ్ల క్రితం గేవర్‌ కిలో రూ.200లకు చొప్పున విక్రయించగా, ప్రస్తుతం చక్కెర, మైదా ధరలు పెరిగిన కారణంగా కిలో రూ.300కు పెంచారు. ఈ స్వీట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బట్టీలో తయారు చేస్తారు. 



Updated Date - 2021-01-14T03:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising