ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంబురాల సంక్రాంతి

ABN, First Publish Date - 2021-01-14T03:57:22+05:30

వాకిట్లో రంగు రంగుల చుక్కల ముగ్గులు.. చక్కని గొబ్బెమ్మలపై పువ్వులు..

భోగిమంట వద్ద మనుమడు, మనుమరాలితో మంత్రి సబితారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సందడిగా మారిన పల్లెలు
  • నేడు మకర సంక్రాంతి.. రేపు కనుమ 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) 

వాకిట్లో రంగు రంగుల చుక్కల ముగ్గులు.. చక్కని గొబ్బెమ్మలపై పువ్వులు.. భగభగ భోగి మంటలు.. హరిదాసుల కీర్తనలు.. డూడూ బసవన్నల ఆటలు.. కొత్త అల్లుళ్ల సందడి.. బావామరదళ్ల చిలిపితనాలు.. నోరూరించే పిండి వంటలు.. నింగిని తాకే గాలిపటాలు.. ఊరే ఉరకలు వేసి ఉత్సవంలా జరుపుకునే సంక్రాంతి రానే వచ్చింది.. ఇంటింటా సంబురాలు తీసుకొచ్చింది. నేడు సంక్రాంతి, రేపు కనుమను కన్నులపండువగా జరుపుకునేందుకు పల్లెలు సిద్ధమయ్యాయి. బంధుమిత్రులతో గ్రామాల్లో సందడి మొదలైంది. 

ఉమ్మడి జిల్లా ప్రజలు బుధవారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున భోగి మంటలు వేసుకున్నారు. ముగ్గులతో వాకిళ్లను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం పుణ్య సాన్నాలు చేసి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు.


ఉమ్మడిజిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు : మంత్రి సబితారెడ్డి

భోగి మంటలతో అన్ని అరిష్టాలు తొలగి ప్రతిఒక్కరి జీవితాల్లో సకల భోగభాగ్యాలు కలగాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆమె తన ఇంటి ఎదుట కుమారుడి పిల్లలతో కలిసి భోగి మంటలు వేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అందరూ ఆనందంగా పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు.



Updated Date - 2021-01-14T03:57:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising