ఇసుక టిప్పర్ పట్టివేత
ABN, First Publish Date - 2021-10-30T04:48:04+05:30
ఇసుక టిప్పర్ పట్టివేత
కులకచర్ల: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌పై కులకచర్ల పోలీసులు కేసునమోదు చేశారు. పాలమూరు జిల్లా నవాబ్‌పేట మండలం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా మండలంలోని బండవెల్కిచర్లకు శుక్రవారం ఉదయం టిప్పర్‌లో ఇసుకను తరలిస్తుండగా ఎస్‌ఐ విఠల్‌రెడ్డి పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. దీంతో టిప్పర్, డ్రైవర్ తిరుమలయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Updated Date - 2021-10-30T04:48:04+05:30 IST