ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక అక్రమ రవాణాను సహించేది లేదు

ABN, First Publish Date - 2021-04-24T04:58:09+05:30

ఇసుక అక్రమ రవాణాను సహించేది లేదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొంరాస్‌పేట్‌: నియోజకవర్గంలో ఇసుక  అక్రమ రవాణాను సహించేది లేదని కొడంగల్‌ సీఐ అప్పయ్య అన్నారు. శుక్రవారం ఆయన బొంరాస్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. అక్రమ ఇసుక రవాణాపై గట్టి నిఘా పెట్టినట్లు తెలిపారు. రెండు సార్ల కంటే ఎక్కువ ట్రాక్టర్లు, లారీలు అక్రమంగా ఇసుకను తరలిస్తూ పట్టుబడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా చేస్తూ పట్టుబడితే వాహనంతో పాటు డ్రైవర్‌, ఓనర్లపై చర్యలు తప్పవన్నారు. ఇసుక రవాణాకు తప్పనిసరిగా తహసీల్దార్‌ అనుమతి పత్రాన్ని పొందాలన్నారు. నియోజకవర్గంలో కొవిడ్‌ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌ సోకినవారు బహిరంగంగా సంచరించరాదన్నారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసి కరోనా తగ్గిన తర్వాత జైలుకు పంపిస్తామన్నారు.  మండలంలో అధికంగా వలస కూలీలు వచ్చి వెళ్తుంటారని, అలాంటి వారు వస్తే సంబంధిత గ్రామ ప్రజాప్రతినిధులు క్వారంటైన్‌కు సూచించాలన్నారు. బొంరాస్‌పేట్‌ మండలంలో శుక్రవారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టుబడినట్లు సీఐ అప్పయ్య తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్సై సత్యశీలారెడ్డి, పోలీసులు ఉన్నారు.  

Updated Date - 2021-04-24T04:58:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising