ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాండూరు నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వానం

ABN, First Publish Date - 2021-07-27T04:30:57+05:30

తాండూరు నియోజకవర్గంలో రోడ్లు ఆధ్వానం

నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్‌

తాండూరు :  తాండూరు నియోజకవర్గ అభివృద్ధిని ప్రజాప్రతినిధులు గాలికొదిలేశారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్‌ ఆరోపించారు. అధ్వానంగా మారిన రోడ్లను మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం తిమ్మాయిపల్లి వద్ద తాండూరు-కొడంగల్‌ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రమేష్‌ మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో అధికార  పార్టీలో చేరిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఎక్కడా అభివృద్ధి చేయలేదన్నారు. తన సొంత అభివృద్ధి మాత్రమే చేసుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరుకుని ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. కార్యక్రమంలో భీమప్ప, ధారాసింగ్‌, బస్వరాజ్‌, అశోక్‌కుమార్‌, వేణు, రాము, జనార్దన్‌రెడ్డి, అనిల్‌, వెంకటేష్‌, రాజవర్దన్‌రెడ్డి,   తదితరులు పాల్గొన్నారు.

నేడు తెగిపోయిన వంతెనల ముట్టడి

ధారూరు: మండల పరిధిలో వర్షాలకు తెగిపోయిన వంతెనల ముట్టడి కార్యక్రమాన్ని  మంగళవారం చేపట్టనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ధారూరు స్టేషన్‌-దోర్నాల, రుద్రారం-నాగసమందర్‌ గ్రామాల మధ్య నాలుగేళ్లుగా వంతెనలు నిర్మించకుండ పాలకులు, అధికారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు చేయటాన్ని నిరసిస్తూమాజీ మంత్రి జి.ప్రసాద్‌కుమార్‌, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి నేతృత్వంలో వంతెనలను ముట్టడిస్తున్నామని చెప్పారు.విజయవంతం చేయాలని కోరారు. 

Updated Date - 2021-07-27T04:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising