ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.3.02కోట్ల మధ్యాహ్న భోజన బకాయిలు విడుదల

ABN, First Publish Date - 2021-12-02T05:14:35+05:30

రూ.3.02కోట్ల మధ్యాహ్న భోజన బకాయిలు విడుదల

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేస్తున్న డీఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): మధ్యాహ్న భోజన నిర్వాహకులకు నాలుగు నెలల బకాయిలు విడుదలయ్యాయి. నాలుగు నెలలకు సంబంధించిన బిల్లులు విడుదలయ్యాయని డీఈవో ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రసాద్‌ బుధవారం తెలిపారు. మేడ్చల్‌ జిల్లాలో 505 ప్రభుత్వ పాఠశాలలున్నాయని, వాటికి సంబంధి ంచి రూ.3.02కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని డీఈవో తెలిపారు. ఆయన మూడుచింతలపల్లి మండలం కొల్తూర్‌ జడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తమకు బిల్లులు రావటం లేదని నిర్వాహకులు తెలుపగా.. భోజన నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే బ్యాంకు ఖాతాల్లో వేస్తామని వెల్లడించారు. మల్కాజ్‌గిరి పరిధిలో రూ.30,90,900, కీసర డివిజన్‌లో రూ.40,68,600, ఉప్పల్‌ డివిజన్‌లో రూ.29,67,400, ఘట్‌కేసర్‌లో రూ.31,71,400, బాల్‌నగర్‌కు రూ.47,75,800, శామీర్‌పేటకు రూ.20,39,100, మేడ్చల్‌కు రూ.23,63,400, కుత్బుల్లాపూర్‌ డివిజన్‌కు రూ.77,67,400 చొప్పున నిధులు వచ్చాయన్నారు.

Updated Date - 2021-12-02T05:14:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising