ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మన్నెకుచ్చెల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ

ABN, First Publish Date - 2021-02-25T05:17:49+05:30

మన్నెకుచ్చెల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయ సేకరణ

అభిప్రాయ సేకరణలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధారూరు: మన్నెకుచ్చెల ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోతున్న భూములకు బదులు భూములే ఇవ్వాలని రైతులు డిమాండు చేశారు. నాగారం గ్రామంలో బుధవారం నాగారం-మైలారం వాగుపై నిర్మించనున్న     మన్నెకుచ్చెల ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలతో జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, రెవెన్యూ, సాగు నీటి శాఖ అధికారులు సర్పంచు కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో అభిప్రాయాలను సేకరించారు.  నాగారం, మైలారం, అంతారం, తరిగోపుల, తదితర గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన 232 ఎకరాల భూమి ప్రాజెక్టు నిర్మాణంలో పోనుంది.  భూములకు బదులుగా భూములనే ఇప్పించాలని  భూ బాధితులు డిమాండ్‌  చేశారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభిచక ముందే తమకు భూములను ఇప్పించాలని,  లేని పక్షంలోతాము భూములు ఇచ్చేందుకు అంగీకరించమని అధికారులకు తేల్చి చెప్పారు. 

భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి

శామీర్‌పేట: కేశ్వాపూర్‌ రిజర్వాయర్‌లో భూములను కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని బుధవారం గ్రామ సర్పంచ్‌ ఇస్తారి రైతులతో వెళ్లి కలెక్టర్‌ శ్వేతా మహంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సానుకూలంగా స్పందిస్తూ రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే గ్రామానికి వచ్చే మిషన్‌ భగీరథ పైపులైన్‌ మరమ్మతు గురించి, గ్రామంలోని సమస్యల గురించి సర్పంచ్‌ కలెక్టర్‌కు తెలిపారు. 

Updated Date - 2021-02-25T05:17:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising