ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీజే అబ్దుల్‌ కలాం జాతీయ పురస్కారాల అందజేత

ABN, First Publish Date - 2021-07-26T05:32:06+05:30

ఏపీజే అబ్దుల్‌ కలాం జాతీయ పురస్కారాల అందజేత

శ్రీనివాస్‌కు పురస్కారాన్ని అందజేస్తున్న డాక్టర్‌ పార్థసారధి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌ (ఆంధ్రజ్యోతి): విద్యారంగంలో విశేష కృషిచేసిన వికారాబాద్‌ వాసి, వికాస్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్రీనివాస్‌ ఆదివారం తెలంగాణ చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సి.పార్థసారధి చేతుల మీదుగా ఏపీజే అబ్దుల్‌ కలాం జాతీయ పురస్కారం-2021 అందుకున్నారు. అదేవిధంగా కెరెళ్లి గ్రామానికి చెందిన తలారి సంజీవ్‌, జైదుపల్లి గ్రామానికి చెందిన బేగరి రాములు అవార్డులు అందుకున్నారు. హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో పుడమి సాహితీ వేదిక, త్యాగరాయ గానసభలు సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఏపీజే అబ్దుల్‌ కలాం జాతీయ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి పార్థసారధి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్య, సాహిత్య, సామాజిక, కళలు, వ్యవసాయం, తదితర రంగాల్లో విశేష కృషిచేసిన వారందరికీ ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు. కాగా విద్యారంగంలో శ్రీనివాస్‌, సాహితీ రంగంలో సంజీవ్‌, గేయ రచయితగా రాములు సేవలందిస్తున్నారు. పుడమి సాహితీవేదిక జాతీయ అధ్యక్షుడు చిలుముల బాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సాహితీవేత్త, మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T05:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising