ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామమందిర నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2021-01-27T05:59:02+05:30

రామమందిర నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు/తలకొండపల్లి/ మంచాల: ఆయోధ్య రామ మందిర నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కాజైపాల్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. ఆమనగల్లులో మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీ, ఆర్‌ఎ్‌సఎస్‌, రామాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రూ.1.16లక్షలు చెక్కును ఆర్‌ఎ్‌సఎస్‌ నేతలు దొంతు విశ్వనాథం, అంజయ్యలకు అందజేశారు.  తలకొండపల్లి వెల్జాలలో మంగళవారం నిధి సేకరణ నిర్వహించారు. సర్పంచ్‌ సంగీతశ్రీనివా్‌సయాదవ్‌  పాల్గొన్నారు. సర్పంచ్‌ రూ.10,116 చెక్కును అందజేశారు. మంచాల మండలం ఆరుట్లలో మాజీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ.సలాం రూ.5555 అందజేశారు.  


ప్రసూన్‌ కన్‌స్ట్రక్షన్‌ రూ.2లక్షల విరాళం 

షాద్‌నగర్‌అర్బన్‌/కేశంపేట: ప్రసూన్‌ కన్‌స్ట్రక్షన్‌ నిర్వాహకులు కేశంపేట మండల పరిధిలోని సంగెం గ్రామానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్‌ యెన్నం గోపాల్‌రెడ్డి కుటుంబసభ్యులు రామమందిర నిర్మాణానికి రూ.2లక్షల విరాళాన్ని అందజేశారు. గోపాల్‌రెడ్డి కుమారుడు యెన్నం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విరాళాన్ని అందజేశారు.  అదేవిధంగా సాయిబాలాజీ డెవలాఫర్స్‌ 1,51,000 రూపాయలు, సాయి బాలాజీ డెవలపర్స్‌ భాగస్వామి రూ.51వేలు,  షాద్‌నగర్‌కు చెందిన బిల్డర్‌ చల్లా విజయభాస్కర్‌రెడ్డి రూ.51వేలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు శ్రీవర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శంకర్‌, ప్రభాకర్‌, విజయ్‌కుమార్‌, రాచయ్య, వంశీకృష్ణలు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T05:59:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising