ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగన్‌వాడీలో ‘పోషణ్‌ అభియాన్‌’

ABN, First Publish Date - 2021-09-17T05:50:59+05:30

అంగన్‌వాడీలో ‘పోషణ్‌ అభియాన్‌’

పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్న సీడీపీవో శాంతిశ్రీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిభట్ల: అంగన్‌వాడీలే కేంద్రంగా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యం అవుతుందని ఐసీడీఎస్‌ సీడీపీవో శాంతిశ్రీ పేర్కొన్నారు.  ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అంజలి అధ్వర్యంలో ఆదిభట్ల మున్సిపాలిటీ పరిదిలోని బొంగ్లూరు అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం పోషణ అభియాన్‌, పోషణమాసం, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీడీపీవో మాట్లాడారు. గర్భిణీలు తీసుకోవాల్సిన పోషక  నియమాలను వివరించారు. కార్యక్రమంలో ఆరు నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన, మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆదిభట్ల కౌన్సిలర్‌ అర్చన రాంరెడ్డి, అంగన్‌వాడీ టీచర్‌ హేమలత, నీలమ్మ, ఆశా వర్కర్‌ సరిత, తదితరులు పాల్గొన్నారు.

గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం పంపిణీ 

షాద్‌నగర్‌ : గర్భిణీలు, బాలింతల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్‌ సరితాయాదగిరి యాదవ్‌ సూచించారు. ఈ మేరకు గురువారం గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు.

Updated Date - 2021-09-17T05:50:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising