విద్యార్థులకు నాట్యమయూరి అవార్డులు
ABN, First Publish Date - 2021-04-18T05:04:49+05:30
విద్యార్థులకు నాట్యమయూరి అవార్డులు
అవార్డులను అందుకుంటున్న బాలకేంద్రం శిక్షకురాలు, చిన్నారులు
వికారాబాద్: నృత్యమాల నాట్య కళా వెల్ఫేర్ సొసైటీ ఉగాది పురస్కారాల్లో భాగంగా శనివారం హైదరాబాద్ ఎన్టీఆర్ కళామందిరంలో కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, పేరిణి, కథక్, మోహిని అట్టం, మణిపూరి, ఒడిస్సా నృత్యాల్లో ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలు అందజేశారు. వికారాబాద్ బాల కేంద్రానికి చెందిన జీవన్, ఆశ్ర, భావిక, నాట్య, విభూషిలు నాట్య మయూరి అవార్డులు అందుకున్నారు. అదే విధంగా శిక్షకురాలు అనురాధకు నిర్వాహకులు అవార్డును అందించారు.
Updated Date - 2021-04-18T05:04:49+05:30 IST