ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎఫ్‌టీఎల్‌, ప్రభుత్వ భూములను కాపాడాలి

ABN, First Publish Date - 2021-06-24T04:31:49+05:30

ఎఫ్‌టీఎల్‌, ప్రభుత్వ భూములను కాపాడాలి

సమావేశంలో మాట్లాడుతున్న అంజయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

కొత్తూర్‌: మండలంలోని ఆయా గ్రామాల్లోని చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్‌, ప్రభుత్వ భూములను కాపాడాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీపీ పి.మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రియల్‌ వెంచర్‌లలో 10శాతం వదిలిన భూమిని జీపీలకు అప్పగించాలని డీఎల్‌పీవోను ఆదేశించారు. రైతుబంధు డబ్బులను బ్యాంకర్లు రైతుల పాత ఖాతాలో జమ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలా జరగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారికి సూచించారు. గ్రామాల్లో ఫాంలాండ్‌ పేరిట రియల్టర్లు వెంచర్లు చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని కొడిచర్ల ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి సభ దృష్టికి తీసుకొ చ్చారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను రెవెన్యూ శాఖ నుంచి స్త్రీశిశుసంక్షేమ శాఖకు బది లీ చేస్తుండడంతో ప్రజాప్రతినిధులు లబ్ధిదారుల కు సహాయసహకారాలు అందించాలన్నారు. గూడూర్‌ గ్రామంలో విద్యుత్‌ తీగలు కిందికి వేలాడుతున్నాయని, దీంతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారని సర్పంచ్‌ సత్తయ్య సభ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మరమ్మతు చేస్తామని ట్రాన్స్‌కో ఏఈ హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులకు ఇచ్చే ఏజెండాలో పూర్తి స్థాయిలో అంశాలు పొం దుపర్చడం లేదని పలువురు సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత, వైస్‌ ఎంపీపీ శోభ, ఎంపీడీవో జ్యోతి, వ్యవసాయాధికారి గోపాల్‌, ఐసీడీఎస్‌ పీడీ నాగమణి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-24T04:31:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising