ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాహనదారులు సేఫ్టీ రూల్స్‌ పాటించాలి

ABN, First Publish Date - 2021-01-22T06:01:07+05:30

వాహనదారులు సేఫ్టీ రూల్స్‌ పాటించాలి

వాహనదారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా రవాణా అధికారి బద్రునాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌/మోమిన్‌పేట/ధారూరు/పరిగి(రూరల్‌)/దోమ: వాహనదారులు తప్పకుండా సేఫ్టీ రూల్స్‌ పాటిస్తూ ప్రమాదాలకు గురికాకుండా వాహనాలను జాగ్రత్తగా నడపాలని జిల్లా రవాణా అధికారి బద్రునాయక్‌ సూచించారు. గురువారం రవాణా శాఖ కార్యాలయ ఆవరణలో 32వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు 2021 భాగంగా రవాణాశాఖ అధికారి వాహనదారులకు అవగాహన కల్పించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఆర్సీ బుక్‌ కలిగి ఉండాలని, సీట్‌ బెల్ట్‌, హెల్మెట్‌ తప్పక ధరించాలని సూచించారు. మోమిన్‌పేటలో సీఐ వెంకటేశం వినూత్న ప్రచారం ప్రారంభించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరాస్తాలో నిలబడి వాహనదారులకు పూలను అందజేసి వాహన నియమ నిబంధనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రవికుమార్‌, ట్రైనింగ్‌ ఎస్‌ఐ అనిత, కానిస్టేబుళ్లు ఉన్నారు. ధారూరు మండల కేంద్రంలోని  అంబేద్కర్‌ చౌరస్తాలో ఎస్‌ఐ సురేష్‌ ఆధ్వర్యంలో వాహనదారులు, డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చంద్రమౌళి, ఎస్‌ఐ2 మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు. పరిగి పట్టణంలో సీఐ లక్ష్మీరెడ్డి ర్యాలీ నిర్వహించి  వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ వారోత్సవాలు ఫిబ్రవరి 17 వరకు కొనసాగుతాయన్నారు. దోమలో ఎస్‌ఐ రాజు, సర్పంచ్‌ రాజిరెడ్డిలు దోమ, బొంపల్లి ప్రధాన చౌరస్తాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పోలీస్‌ సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T06:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising