ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణను అస్థిరపరిచేందుకు కుట్ర

ABN, First Publish Date - 2021-02-27T04:59:59+05:30

తెలంగాణను అస్థిరపరిచేందుకు కుట్ర

మాట్లాడుతున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

ఆమనగల్లు : పోరాడి సాధించుకున్న తెలంగాణను అస్థిర పరిచేందుకు కుట్ర జరుగుతోందని అందులో భాగమే రాజన్న రాజ్యం పేరుతో వైఎస్‌ షర్మిల కొత్త పార్టీ ఎత్తుగడ అని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. ఆమనగల్లులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ పెట్టి పోటీ చేయగానే రాజన్న రాజ్యం వస్తుందన్న భ్రమను షర్మిల వీడాలన్నారు. రాయలసీమ రాజకీయం, కుట్రలు తెలంగాణలో పనిచేయవని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో విపక్షాలు అవకాశవాద రాజకీయాలు సాగిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ నోరు అదుపులో పెట్టుకోకపోతే టీఆర్‌ఎస్‌ సైన్యం చేతిలో గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో టీఆర్‌ఎ్‌సకు 60 లక్షల మంది సైన్యం ఉందని, ఈ ఏడాది దాన్ని 80 లక్షలకు పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌స్‌ అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌, టీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ కన్వీనర్‌ అప్పం శ్రీను,  మం డల అధ్యక్షుడు నిట్ట నారాయణ, జిల్లా నాయకుడు తోట గిరియాదవ్‌, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు దోనాదుల కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T04:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising