ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.150 కోట్లతో బీటీరోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు

ABN, First Publish Date - 2021-01-25T05:44:27+05:30

రూ.150 కోట్లతో బీటీరోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు

వినతిపత్రం ఇస్తున్న దయ్యాలబోడుతండా నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌

ఆమనగల్లు : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో రూ.150 కోట్లతో 35 బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించినట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ తెలిపారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాల పరిధిలో బీటీ రోడ్ల మంజూరు, మరమ్మతులపై ఆదివారం నగరంలోని తన నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆమనగల్లు మండలం దయ్యాలబోడు తండాకు చెందిన నాయకులు రాజు, భీమ్‌లాల్‌, శ్రీను, రమేశ్‌, విజయ్‌ ఆధ్వర్యంలో స్థానికులు బీటీరోడ్డు నిర్మాణం గురించి ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అర కిలోమీటరు బీటీ రోడ్డు నిర్మిస్తే రాకపోకలకు ఇబ్బందులు తొలుగుతాయని తండా వాసులు కోరగా సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు జర్పుల దశరథ్‌నాయక్‌, అనురాధపత్యనాయక్‌, సింగిల్‌విండో చైర్మన్‌ గంప వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ, నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, తోట గిరియాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T05:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising