ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలీలను విభజించే చర్యలను మానుకోవాలి

ABN, First Publish Date - 2021-07-27T04:43:59+05:30

కూలీలను విభజించే చర్యలను మానుకోవాలి

ఆర్డీవోకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దళిత, గిరిజన, వ్యవసాయ కార్మిక సంఘాల డిమాండ్‌

షాద్‌నగర్‌ : కులాలవారీగా కూలీలను విభజించి కూలి డబ్బులు చెల్లించేచర్యలను మానుకోవాలని దళిత, గిరిజన, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.  సోమవారం షాద్‌నగర్‌ ఆర్డీవో రాజేశ్వరిని కలిసి  వినతిపత్రం అందజేశారు. కార్మిక సంఘాల దేశవ్యాప్త నిరసనలో భాగంగా  వ్యవసాయ  కార్మిక సంఘం నేత రాజు, గిరిజన సంఘం జిల్లా కన్వీనర్‌ శ్రీనునాయక్‌, వ్యకాస జిల్లా కార్యదర్శి బద్దుల జంగయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ  ఉపాధిహామీ పథకంలో కులాల వారీగా కూలీల వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను వెనక్కి తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు పోరాడి ఉపాధిహామీని సాధించారని, ఇది ప్రభుత్వాలు పెట్టే భిక్ష కాదని అన్నారు. ఉపాధిహామి పథకంలో పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడ ుదల చేయాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-07-27T04:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising