ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులకు మధుసూదన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

ABN, First Publish Date - 2021-07-30T04:45:10+05:30

దళితులకు మధుసూదన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

మధుసూధన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వికారాబాద్‌, (ఆంధ్ర జ్యోతి): ఈటల రాజేందర్‌ బావమరిది మధుసూదన్‌రెడ్డి దళితులను కించపరుస్తూ  చేసిన వ్యాఖ్యలను వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరంగా ముందుకెళ్తామని టీఆర్‌ఎస్‌ నాయకులు హెచ్చరించారు. మధుసూదన్‌రెడ్డి దళితులను దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గురువారం సాయంత్రం మధుసూదన్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా అధ్యక్షుడు భూమోళ్ల కృష్ణయ్య మాట్లాడుతూ దళితులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మధుసూధన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఇంకా కుల వివక్ష కొనసాగుతుండడం సిగ్గు చేటన్నారు. దళిత వ్యతిరేక పార్టీలకు వెళ్లామని చెప్పి దళితులను అవమానించేలా మాట్లాడితే తగిన గుణపాఠం నేర్పుతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ రామస్వామి, టీఆర్‌ఎ్‌సవీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎం.సురేష్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు గోపీ పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-30T04:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising