ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గోవిందా.. వేణుగోపాలా..

ABN, First Publish Date - 2021-03-01T04:38:31+05:30

గోవిందా.. వేణుగోపాలా..

మంచాల : రథాన్ని లాగుతున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కనుల పండువగా వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు 
  • జనసంద్రంగా రథోత్సవం
  • గోవింద నామస్మరణతో మార్మోగిన వీధులు 
  • పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

మంచాల: మండల పరిధి ఆరుట్లలో శ్రీవేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయి. ఈనెల 25న ప్రారంభమైన ఉత్సవాలు నాలుగురోజులపాటు వైభవంగా కొనసాగాయి. స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఊరేగించారు. ఆదివారం ఉదయం 8 గం.లకు ప్రారంభమైన స్వామి వారి రథోత్సవం భక్తుల జయజయధ్వానాల మధ్య రాత్రి వరకు కొనసాగింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా, వీధులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు ఉత్సవకమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో కళాకారుల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. నల్లగొండ జిల్లా పంతంగి నుంచి 50 మందితో కూడిన భజన కళా బృందం ప్రదర్శించిన కోలాటాలు, జెడకొప్పులు, ఆటాపాటాలు ఆధ్యంతం భక్తులకు కనువిందు చేసింది.


ముగిసిన వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

కందుకూరు: మండలంలోని పులిమామిడిలో అంగరంగ వైభవంగా సాగిన చీకటి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. మూడు రోజులు పండితులు రాజశేఖరశర్మ నేతృత్వంలో బ్రంహ్మోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అనిత, ఎంపీటీసీ రాజమ్మ, మాజీ వైస్‌ఎంపీపీ సంధ్యాదామోదర్‌గౌడ్‌, మాజీ ఎంపీటీసీ కృష్ణానాయక్‌, మాజీ సర్పంచ్‌ దేవిపాండుగౌడ్‌, బీజేపీ రాష్ట్ర నాయకుడు అందెల శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కొత్తగా ట్రాక్టర్లతో ఆలయ ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. మూడు రోజుల పాటు జైత్వారానికి చెందిన భజనమండలి కీర్తనలు ఆలపించారు.

Updated Date - 2021-03-01T04:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising