ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణలక్ష్యం రూ.360 కోట్లు

ABN, First Publish Date - 2021-10-26T04:25:57+05:30

రుణలక్ష్యం రూ.360 కోట్లు

ఎస్‌హెచ్‌జీ గ్రూపు సభ్యులకు చెక్కు అందజేస్తున్న కిషన్‌శర్మ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బ్యాంకు రుణాలతో లబ్ధిపొందాలి 
  • ఎస్‌ఎల్‌బీసీ తెలంగాణ కన్వీనర్‌ కిషన్‌శర్మ

వికారాబాద్‌ : జిల్లాలో ఈఆర్థిక సంవత్సరం 360 కోట్ల  రుణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు రూ.160కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని, మిగితాది బ్యాంకర్ల సహకారంతో పూర్తి చేస్తామని ఎస్‌ఎల్‌బీసీ తెలంగాణ కన్వీనర్‌ కిషన్‌శర్మ తెలిపారు. సోమవారం లీడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో సత్యభారతి ఫంక్షన్‌ హాల్‌లో రుణ విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతేడాది వంద శాతం రుణలక్ష్యం పూర్తి చేశామన్నారు. ఈసారి  జిల్లాలో 2251 లబ్ధిదారులకు రూ.63కోట్ల 40లక్షల  రుణాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు బ్యాంకులు అందించే ఋణ పథకాలపై అవగాహన కల్పించుకొని లబ్ధ్ది పొందాలని సూచించారు. వివిధ బ్యాంకుల ద్వారా మహిళాగ్రూప్‌ సభ్యులకు, రైతులకు, వ్యాపార వేత్తలతో పాటు కార్‌ లోన్లు, వ్యక్తిగత లోన్లు ఇవ్వడం జరిగిందన్నారు. వారం రోజుల్లో 27 బ్యాంకుల ద్వారా రూ.1.7కోట్లు గృహ, పంట ఋణాలు అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ కృష్ణన్‌ మాట్లాడుతూ, బ్యాంకర్ల సహకారంతో ప్రతి ఒక్కరికి బ్యాంకు రుణాలు అందేటట్లు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ ద్వారా ఎంపికైన ఎస్‌హెచ్‌జీ మహిళా గ్రూపు సభ్యులకు రూ.15కోట్ల చెక్కును అందించగా, మెప్మా ద్వారా లబ్ధ్దిదారులకు రూ.3కోట్ల 12లక్షల చెక్కును ఎస్‌హెచ్‌జీ మహిళా గ్రూపు సభ్యులకు అందించడం జరిగిందన్నారు.పెద్దెముల్‌ గ్రూప్‌సభ్యులకు రూ.75లక్షలు, ఎస్బీఐ నుంచి ఫంక్షన్‌ హాల్‌ కోసం రూ.3కోట్లు, వివిధ స్కీంల కింద లోన్లు మంజూరు చేశారు.  ఈ కార్యక్రమంలో ఎస్బీఐ డీజీఎం దిబశి్‌షమిశ్రా, ఎస్బీఐ ఆర్‌ఎం శ్రీధర్‌ బాపూజీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్‌ఎం సయ్యద్‌ యూసఫ్‌, హెచ్‌డీసీసీబీ డీజీఎం కిరణ్‌కుమార్‌, ఈడీ ఎస్సీ కార్పొరేషన్‌ బాబుమోజెస్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T04:25:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising