ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2021-04-17T05:08:19+05:30

రంగారెడ్డి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి


(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్‌) : రంగారెడ్డి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ సర్వే నెంబర్‌ 85లో రైతులు సాగు చేసుకుంటున్న భూములను ఆన్‌లైన్‌ రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు. అలాగే సర్ధార్‌నగర్‌లో 20ఎకరాలకుపై భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు ఆన్‌లైన్‌ రికార్డులతో కూడిన కొత్త పట్టాదారు పాస్‌ బుక్కులు ఇవ్వాలన్నారు. అలాగే నాగారంలో ఇళ్లు లేని 209మందికి పట్టాలు ఇచ్చినా, స్థలం కేటాయించలేదని వాపోయారు. శంషాబాద్‌ మండలంలోని కొత్వాల్‌గూడలో సర్వేనెంబర్‌ 54, 56లోని ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు ఇళ్లస్థలాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. భూప్రక్షాళనలో అసంపూర్తిగా ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌అఫ్సర్‌, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దత్తునాయక్‌, ప్రభాకర్‌, అర్జున్‌రెడ్డి, కోటేశ్‌, రైతులు ఉన్నారు. 

Updated Date - 2021-04-17T05:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising