ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా లక్ష్మీనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు

ABN, First Publish Date - 2021-04-24T04:08:28+05:30

వైభవంగా లక్ష్మీనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొండపల్లి : మండల పరిధిలోని వెంకటాపూర్‌ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్‌-19 నిబంధనలను అనుసరించి నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. భక్తులు మాస్క్‌లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా తొలిరోజు గణపతి పూజ, స్వస్తిహవచనం, 108 కలశముల మహాభిషేకం, హోమం, సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకుడు నర్సింహశాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన హోమంలో సర్పంచ్‌ రమేశ్‌యాదవ్‌, ఎంపీటీసీ సునిత సుదర్శన్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. శనివారం స్వామి వారి కల్యాణం నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ వైస్‌ చైర్మన్‌ అంజన్‌రెడ్డి, రాములు, వెంకటయ్య, కృష్ణయ్య, శేఖర్‌, ఆంజనేయులు, శ్రీను, మల్లేశ్‌, రవీందర్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:08:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising