ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు పోటీపడాలి

ABN, First Publish Date - 2021-01-13T05:07:22+05:30

సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు పోటీపడాలి

గంప వెంకటేశ్‌కు సభ్యత్వం అందజేస్తున్న చెన్నకిషన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు : సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు పోటీపడాలని లయన్స్‌క్లబ్‌ జిల్లా మాజీ గవర్నర్‌ జి.చెన్నకిషన్‌రెడ్డి అన్నా రు. ఆమనగల్లు పట్టణంలోని కల్యాణి గార్డెన్స్‌ లో మంగళవారం జరిగిన లయన్స్‌క్లబ్‌ సమావేశం నిర్వహించారు. ఆమనగల్లు లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు కసిరెడ్డి రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి లయన్స్‌క్లబ్‌ జిల్లా మాజీ గవర్నర్‌ జి. చెన్నకిషన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ గంపా వెంకటేశ్‌, ఎనుగొండ రాంరెడ్డి లయన్స్‌ కంటి ఆసుపత్రి చైర్మన్‌ డాక్టర్‌ దామోదర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లయన్స్‌క్లబ్‌ అంతర్జాతీయ సభ్యత్వాన్ని వెంకటేశ్‌కు అందజేశారు. లయన్స్‌క్లబ్‌ అంతర్జాతీయ అధ్యక్షుడు చుంగుయున్‌ అవార్డును వెంకటేశ్‌కు అందజేసి సత్కరించారు. వెంకటేశ్‌ సేవానిరతిని ఈ సందర్భంగా క్లబ్‌ సభ్యులు కొనియాడారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్‌ సభ్యులు జూలూరి రమేశ్‌, వెంకట్‌రెడ్డి, ఎంగళి బాలకృష్ణ,కొరివి వెంకటయ్య, నటరాజ్‌ యాదయ్య, సుధీర్‌రెడ్డి, కసిరెడ్డి పురుషోత్తంరెడ్డి, కండె ఓంకారం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-13T05:07:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising