మానవత్వాన్ని చాటుకున్న కిచ్చన్నగారి వెంకట్‌రెడ్డి
ABN, First Publish Date - 2021-10-30T04:23:26+05:30
మానవత్వాన్ని చాటుకున్న కిచ్చన్నగారి వెంకట్‌రెడ్డి
చేవెళ్ల : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాధితుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి వారి ఇద్దరి పిల్లల్లో ఒకరిని డిగ్రీ వరకు చదివించేందుకు కృషిచేస్తానని చేవెళ్ల గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, ఎల్‌ఐసీ ఏజెంట్ కిచ్చన్నగారి వెంకట్‌రెడ్డి అన్నారు. కాగా, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వడ్ల విశ్వనాథం చారి కుటుంబాన్ని శుక్రవారం చేవెళ్లలో పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడి భార్య, పిల్లలకు రూ.20వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. విశ్వనాథం చారి మరణం చాలా బాధాకరమన్నారు. ఆయన భార్య రజితకు ఎల్‌ఐసీ ఆఫీసులో తగిన వేతనంతో కూడిన ఉద్యోగాన్ని కల్పిస్తామన్నారు. ఆమెకున్న ఇద్దరు ఆడపిల్లల్లో ఒకరిని డిగ్రీ వరకు చదివిస్తానని హామీ ఇచ్చారు. ఎల్‌ఐసీ వెంకట్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో చేవెళ్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ రంగారెడ్డి అర్బన్ రిపోర్టర్ శ్రీనివాస్ చారి, సీనియర్ జర్నలిస్టులు రాజేశ్, ఆనంద్, చేవెళ్ల మండల రజక సంఘం అధ్యక్షుడు సీహెచ్. శ్రీనివాస్, స్థానిక జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:23:26+05:30 IST