ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులను మోసగిస్తున్న కేసీఆర్‌

ABN, First Publish Date - 2021-07-27T04:42:40+05:30

దళితులను మోసగిస్తున్న కేసీఆర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీవర్ధన్‌రెడ్డి


షాద్‌నగర్‌అర్బన్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ దళితులను మోసగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎన్‌. శ్రీవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. షాద్‌నగర్‌ బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్‌ మాటను విస్మరించారన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళు నేటికీ ఇవ్వలేదన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షలు ఇస్తామని ప్రచారం చేస్తూ మరో మోసానికి తెరలేపుతున్నాడని ఆరోపించారు. సమావేశంలో బీజేపీ నాయకులు వెంకటేష్‌, విఠ్యాల నర్సింహులు, శివశంకర్‌, మల్లేష్‌, శరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా ప్రచార కార్యదర్శిగా శ్యాంసుందర్‌రెడ్డి

షాద్‌నగర్‌అర్బన్‌: బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా ప్రచార కార్యదర్శిగా షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ఎస్‌.శ్యాంసుందర్‌రెడ్డిని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి నియామకపత్రాన్ని అందించారు. అలాగే చౌదరిగూడ మండలం గాలిగూడ గ్రామానికి చెందిన పాలమూరి జగదీష్‌ను జిల్లా కోశాధికారిగా, వీరన్నపేట గ్రామానికి చెందిన హరీష్‌, చౌదరిగూడ గ్రామానికి చెందిన మల్లేష్‌, కొందుర్గు మండలంలోని విశ్వనాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన శివారెడ్డిలను కార్యవర్గ సభ్యులుగా నియమించారు. కార్యక్రమంలో కిసాన్‌మోర్చా రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T04:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising