ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితుల సాధికారతకు కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయం

ABN, First Publish Date - 2021-07-27T04:45:15+05:30

దళితుల సాధికారతకు కేసీఆర్‌ సాహసోపేత నిర్ణయం

ర్యాలీలో డప్పు కొడుతున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌


కడ్తాల్‌: రాష్ట్రంలో దళితుల సాధికారిత కోసం సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకం సాహసోపేత నిర్ణయమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కంబాల పరమేశ్‌ ఆధ్వర్యంలో దళితబంధు పథకాన్ని హర్షిస్తూ పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి అనంతరం డప్పు కొడుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణ దళితుల శ్రేయస్సును కాంక్షించి రూ.లక్ష కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఓర్వలేని విపక్షాలు దీనిని రాజకీయం చేయడం తగదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌, సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, టీఆర్‌ఎ్‌స్‌ మండల అధ్యక్షుడు బాచిరెడ్ఢి శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీలు గోపాల్‌, లచ్చిరామ్‌నాయక్‌, ప్రియరమేశ్‌, మంజుల చంద్రమౌళి, సర్పంచ్‌లు తులసీరామ్‌నాయక్‌, హరిచంద్‌ నాయక్‌, యాదయ్య, ఉప సర్పంచ్‌ కడారి రామకృష్ణ, నాయకులు మంగళపల్లి నర్సింహ్మ, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T04:45:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising