ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయానికి ప్రతీకగా జమ్మిచెట్టు

ABN, First Publish Date - 2021-10-11T05:17:46+05:30

విజయానికి ప్రతీకగా జమ్మిచెట్టు

శివరాంనగర్‌ కాలనీలో జమ్మిమొక్క నాటుతున్న శ్రీనివాస్‌గుప్తా, ఎమ్మెల్యే ఆనంద్‌,
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గుప్తా


వికారాబాద్‌ : గొప్ప నాగరికత కలిగిన చెట్టు జమ్మి చెట్టు అని టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గుప్తా అన్నారు. ఆదివారం ఆయన వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి మున్సిపల్‌ పరిధిలోని 31వ వార్డు శివరాంనగర్‌లో కౌన్సిలర్‌ గాయత్రిలక్ష్మణ్‌ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఊరికో జమ్మిచెట్టు, గుడికో జమ్మిచెట్టు’ కార్యక్రమంలో భాగంగా జమ్మి మొక్కను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ, విజయానికి ప్రతీకగా భావించే జమ్మి చెట్టును నాటడం అద్భుతమైన అనుభూతిని కలిగించిందన్నారు. చరిత్ర కలిగిన జమ్మిచెట్టు ప్రతీ ఊరిలో.. ప్రతి గుడిలో ఉండాలనే తలంపుతో కార్యక్రమాన్ని తీసుకున్న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌, కౌన్సిలర్‌ గాయత్రిలక్ష్మణ్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-11T05:17:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising