ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వమత సమ్మేళనం తెలంగాణ

ABN, First Publish Date - 2021-05-09T05:05:06+05:30

సర్వమత సమ్మేళనం తెలంగాణ

ఆమనగల్లులో రంజాన్‌ తోఫా అందజేస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు/తలకొండపల్లి/మాడ్గుల: రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యం ఇస్తోందని, సర్వమతాల సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువుగా ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. శనివారం ముస్లింలకు ఆమనగల్లులోని జామ మజీద్‌లో రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. ఈ సం దర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందన్నారు. ప్రజల ఆకాంక్షలకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వం నుంచి 300 మందికి రంజాన్‌ తోఫా పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌, ఎంపీటీసీ కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు సయ్యద్‌ ఖలీల్‌, కౌన్సిలర్లు రాధమ్మవెంకటయ్య, సోనిజయరామ్‌, చెన్నంపల్లి సర్పంచ్‌ శ్రీనయ్య, నాయకులు గిరియాదవ్‌, వెంకట్‌రెడ్డి, రఘు, లక్ష్మి, రవీందర్‌, గణేశ్‌, నరేందర్‌, మొయినుద్దీన్‌, ఖాద్రీ, మహబూబ్‌ అలీ, అల్తాఫ్‌, ఫారూఖ్‌, రఫీక్‌, హైమద్‌, వాహీద్‌, అఫ్రోజ్‌ పాల్గొన్నారు. తలకొండపల్లిలోని జామా మజీద్‌లో ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పాల్గొన్నారు. జడ్పీ, మండల కో-ఆప్షన్‌ సభ్యులు ముజుబుర్‌ రహెమాన్‌, ఇమ్రాన్‌, ఎస్‌ఐ వరప్రసాద్‌, మాజీ ఎంపీపీ శ్రీనివా్‌సయాదవ్‌ టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు లలితజ్యోతయ్య, సంగీతశ్రీనివాస్‌, మాజీ జడ్పీటీసీ నర్సింహ, మల్లారెడ్డి, ఖాజాపాషా, సజ్జుపాష, దస్తగిరి, రహీం, అన్వర్‌, కరీముల్లా, మల్లేశ్‌, జగన్‌రెడ్డి పాల్గొన్నారు. రంజాన్‌ పండుగను కులమతాలకు అతీతంగా జరపుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ అన్నారు. మాడ్గుల పంచాయతీ ఆవరణలో దుస్తుల పంపిణలో ఆయన పా ల్గొన్నారు. 9 పంచాయతీల పరిధిలోని 124మందికి దుస్తులు పంపిణీ చేశారు. అలాగే 9మందికి సీఎం రిలీ్‌ఫఫండ్‌ చెక్కులను అందజేశారు. సర్పంచ్‌ జంగయ్యగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లాలయ్యగౌడ, బ్రహ్మంగౌడ్‌ పాల్గొన్నారు.


  • రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం


శంకర్‌పల్లి: సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశాని కే ఆదర్శంగా నిలుస్తున్నాయని మున్సిపాలిటీ కో-ఆప్షన్‌ సభ్యురాలు షబానాబేగం తెలిపారు. రంజాన్‌ సంధర్భంగా శనివారం దుస్తుల పం పిణీ కార్యక్రమం చేపట్టారు. నాయకులు ఎస్డీ మాజిద్‌పాషా, ఎస్డీ న యీం, ఎండీ నయీమ్‌, ఇమ్రాన్‌పాషా, సత్తార్‌, కరీం పాల్గొన్నారు.


  • బీసీ భవనం నిర్మాణానికి ఎమ్మెల్యేకు వినతి


కడ్తాల్‌: మండల కేంద్రంలో బీసీ భవనం నిర్మించాలని సంఘం నాయకులు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను కోరారు. శనివారం సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి బీసీ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌ ఆధ్వర్యంలో ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. భవనం కోసం పంచాయతీ 3వేల గజాల స్థలం కేటాయించిందని నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. బీసీ కమ్యూనిటీ హాల్‌ ఉంటే శుభకార్యాలు, సమావేశాలు జరుపుకోవడానికి వీలుగా ఉంటుందని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఉపసర్పంచ్‌ రామకృష్ణ, యువజన సంఘాల ఐక్య వేదిక మండల అధ్యక్షుడు రాఘవేందర్‌, మల్లేశ్‌గౌడ్‌, జ హంగిర్‌ అలీ, రామచంద్రయ్య, వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising