ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు పది బస్తీ దవాఖానాల ప్రారంభోత్సవం

ABN, First Publish Date - 2021-12-03T05:04:34+05:30

నేడు పది బస్తీ దవాఖానాల ప్రారంభోత్సవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మేడ్చల్‌లో నేడు ప్రారంభం కానున్న బస్తీ దవాఖానా

(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి): మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా పట్టణాల్లో నిర్మించిన పది బస్తీ దవాఖానాలు శుక్రవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. జిల్లాలో ఇప్పటికే 52 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయి. నేడు ఆరోగ్యశాఖ మంత్రి హరీ్‌షరావు, కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పది బస్తీ దవాఖనాలు ప్రారంభం కానున్నాయి. ప్రతి బస్తీ దవాణానలో ఒక వైద్యుడు, ఒక స్టాఫ్‌నర్సు, సపోర్టు స్టాఫ్‌ ఉంటారు. నేడు ప్రారంభం కానున్న పది బస్తీ దవాఖానాల్లో  శాంతినికేతన్‌ కమ్యూనిటీ హల్‌ ప్రాంతంలో ఉన్న బస్తీ దవాఖానాను ఆరోగ్యశాఖ మంత్రి హరీ్‌షరావు, ఎన్‌ఎల్‌బీనగర్‌లో కుమ్యూరనిటీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించనున్నారు. నాచారంలోని అ న్నపూర్ణ కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా ను ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, బీరపుగడ్డ, హబ్సీగూడలో ఎమ్మెల్యే బేతి సుభా్‌షరెడ్డి, ఫిరోజ్‌గూడలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, హైదర్‌నగర్‌లోని అపురూప కాలనీలో ఎమ్మెల్యే వివేకానంద, హైదర్‌నగర్‌లో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, చెక్‌పోస్టు కమ్యూనిటీ హాల్‌ వద్ద ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను కార్పొరేటర్‌ వీణఉపేందర్‌రెడ్డి, ఓల్డ్‌ మీర్జాల్‌గూడలో కార్పొరేటర్‌ రాము చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఉదయం 10గంటలకు అన్ని ప్రాంతాల్లో ఒకేసారి బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తారని డీఎంఅండ్‌హెచ్‌వో మల్లికార్జున్‌రావు తెలిపారు.

Updated Date - 2021-12-03T05:04:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising