ఇనాం భూములకు ఓఆర్సీ ఇవ్వాలి
ABN, First Publish Date - 2021-10-05T04:06:20+05:30
గ్రామాల్లో వివిధ వృత్తుల్లో పని చేసేవారికి ఇచ్చిన
- చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ల : గ్రామాల్లో వివిధ వృత్తుల్లో పని చేసేవారికి ఇచ్చిన ఇనాం భూములకు ఓఆర్సీ లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఇనాం భూముల ఓఆర్సీని సంబంధిత రైతులకు అందిం చాలన్నారు. అలాగే గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులు చనిపోతే వాటిని ధరణి వెబ్‌సైట్‌లో ఎక్కించడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించి ఎమ్మెల్యే చెప్పిన అంశాలను నోట్ చేసుకుని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
Updated Date - 2021-10-05T04:06:20+05:30 IST