ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలి

ABN, First Publish Date - 2021-06-15T05:15:08+05:30

పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలి

నర్సరీని పరిశీలిస్తున్న జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా సర్పంచ్‌లు పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలని జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తి పేర్కొన్నారు. సోమవారం మేడ్చల్‌ మండలం మునిరాబాద్‌లో ఆకస్మికంగా తనిఖీ చేసి నర్సరీ, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు షెడ్డు, రోడ్లును పరిశీలించారు. నీటి ట్యాంకులను నెలకు మూడుసార్లు కడగా లని, తాగునీరు కలుషితం కాకుండా రోజూ బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి సరఫరా చేయాలని ఆదేశించారు. ట్యాంక్‌ శుభ్రం చేసిన తేదీని ట్యాంక్‌ వద్ద రాయాలని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్‌ గణేష్‌, ఎంపీవో వినూత్న, పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్‌, బిల్‌కలెక్టర్‌ విజయ్‌ ఉన్నారు.


  • డీపీవోను కలిసిన మండల సర్పంచ్‌లు


మూడుచింతలపల్లి: నూతన డీపీవో రమణమూర్తిని మండల సర్పంచ్‌లు సంఘం అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్‌లు జామ్‌ రవి, ఆంజనేయులు, అనురాధరవీందర్‌రెడ్డి, గోపినాయక్‌, కృ పాకర్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, రామచంద్రయ్య, అలితనర్సింహ ఉన్నారు.

Updated Date - 2021-06-15T05:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising