ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారంలో భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2021-06-20T05:25:08+05:30

హరితహారంలో భాగస్వాములు కావాలి

మొక్క నాటుతున్న మంత్రి మల్లారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి
  • మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ కండ్లకోయ వద్ద జాతీయ రహదారి పక్కన శనివారం నిర్వహించిన 7వ విడత హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతో పాటు ప్రతీ మొక్కను సంరక్షించాలన్నారు. గ్రామాల్లో లక్ష్యం మేరకు మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు అందరూ కృషి చేయాలన్నారు. భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించాలంటే విరివిగా మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వం హరితహారంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటడంతో పాటు మొక్కల సంరక్షణకు తగిన చర్యలు చేపడుతున్నదని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి, వైస్‌చైర్మన్‌ ప్రభాకర్‌, మాజీ సర్పంచ్‌లు మద్దుల శ్రీనివా్‌సరెడ్డి, కందాడి నరేందర్‌రెడ్డి, రవీరందర్‌ గౌడ్‌, నాయకులు రాజేందర్‌ముదిరాజ్‌, సంజీవగౌడ్‌, గౌస్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-20T05:25:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising