ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తూర్‌ మున్సిపాలిటీ ఎన్నికకు కసరత్తు

ABN, First Publish Date - 2021-02-25T04:52:36+05:30

కొత్తూర్‌ మున్సిపాలిటీ ఎన్నికకు కసరత్తు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వార్డుల విభజనకు నోటిఫికేషన్‌ 
  • మార్చి 25న ఫైనల్‌ జాబితా

కొత్తూర్‌: వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్లు, సిద్దిపేట తదితర కౌన్సిళ్ల ఎన్నికలకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పాటైన కొత్తూరు మున్సిపాలిటీ వార్డుల విభజనకు సైతం నోటిఫికేషన్‌ విడుదలైంది. మున్సిపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ సీడీఎంఏకు ఉత్తర్వులు జారీచేశారు. కొత్తూర్‌ మున్సిపాలిటీని మొదట అధికారులు 12వార్డులుగా విభజించారు. ఈ వార్డులపై ఫీల్డ్‌ సర్వే చేసి డ్రాఫ్ట్‌లి్‌స్టను పంపనున్నారు. వార్డుల విభజన, సంఖ్యపై ఎమ్మెల్యే, ఎంపీ, రాజకీయ నాయకులు, ప్రజల అభిప్రాయాలు, సలహాలు స్వీకరించి రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తారు. ఈనెల 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు వార్డుల్లో సర్వే నిర్వహిస్తారు. మార్చి 7నుంచి 8వరకు వార్డుల విభజనపై ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజల నుంచి  సూచనలు స్వీకరిస్తారు. మార్చి 9 నుంచి 15 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. మార్చి 16 నుంచి 21 వరకు అభ్యంతరాలను పరిష్కరిస్తారు. మార్చి 22న సీఎండీఏకు నివేదిక అందిస్తారు. మార్చి 23 నుంచి 24 వరకు సీఎండీఏ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందుతుంది. మార్చి 25న తుది వార్డుల విభజన నోటిఫికేషన్‌ వెలువరుస్తామని ప్రభుత్వం తన జీవోలో పేర్కొంది.

Updated Date - 2021-02-25T04:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising