ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా పెరుగు బసంతం

ABN, First Publish Date - 2021-07-25T05:07:42+05:30

వైభవంగా పెరుగు బసంతం

పెరుగు బసంతంలో పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పెద్దఎత్తున తరలివచ్చిన భక్తజనం 
  • స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆనంద్‌


వికారాబాద్‌: అనంతగిరి శ్రీఅనంతపద్మనాభ స్వామి ఆలయ ఆషాడ మాస చిన్న జాతర ను పురస్కరించుకుని శనివారం వందలాది భక్తుల నడుమ పెరుగు బసంతం వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వామి వారిని గరుడ వాహనంలో ఊరేగిస్తూ పుష్కరిణి వద్ద తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక మహా ప్రసాదాన్ని తయారు చేసి ఉట్టిలో తీసుకువచ్చారు. అనంతరం ఆలయం ముందున్న ఉత్సవ స్తంభంపై ఉట్టిని ఎక్కించారు. ఉట్టిని పగుల గొట్టి అందులోని ప్రసాదాన్ని భక్తులకు చల్లారు. ప్రసాదాన్ని తీసుకోవడానికి భక్తులు ఉత్సాహం చూపారు. పెరుగు బసంతంలో పంచే మహా ప్రసాదాన్ని భక్తులు ఇక్కడి నుంచి తీసుకెళ్లి పొలాల్లో వేసుకుంటే పంటలు బాగా పండుతాయని, ఇంట్లో చల్లితే శుభం కలుగుతుందని రైతులు, ప్రజల విశ్వాసం. అనంతరం స్వామి వారికి హారతి ఇచ్చి ఉత్సవాన్ని ముగించారు. ఇదిలా ఉంటే స్వామి వారిని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌, ఎంపీపీ చంద్రకళ, జడ్పీటీసీ ప్రమోదీనిరెడ్డి, ఎంపీడీవో సుభాషిణి, నాయకులు దర్శించుకున్నారు. 

Updated Date - 2021-07-25T05:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising