ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-04-13T05:17:52+05:30

వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి

వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 14నుంచి నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను సోమవారం నగరంలోని తన నివాసంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, షాపింగ్‌ మాల్స్‌, ఆసుపత్రుల వద్ద, పరిశ్రమలు, పాఠశాలల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీచోట అగ్నిమాపక పరికరాలు సరిగా పని చేస్తున్నాయో లేదో పరీక్షించాలన్నారు. గతంలో జరిగిన సంఘటనలు పరిశీలించి, భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చూడాలని మంత్రి ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఏదైనా ప్రమాదం జరిగితే 101 నెంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పాలని, అగ్నిమాపక వారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫైర్‌ అధికారి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అదనపు అధికారులు గిరిధర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, కేంద్ర అధికారులు శ్రీనివాస్‌, జగన్మోహన్‌ ఉన్నారు. 



Updated Date - 2021-04-13T05:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising