ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు అధైర్య పడొద్దు

ABN, First Publish Date - 2021-04-24T04:07:00+05:30

రైతులు అధైర్య పడొద్దు

దెబ్బతిన్న వరి పంటను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌


తలకొండపల్లి : అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ అన్నారు. రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. తలకొండపల్లి మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పర్యటించారు. రాంపూర్‌గ్రామంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటను ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. పంటల నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వ పరంగా తగిన సాయమందేలా చూస్తానని జైపాల్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. గ్రామాలు, పంటల వారీగా నష్టం అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి రాజుకు ఆదేశించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలు, సాయం గూర్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోతానని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ మోహన్‌రెడ్డి, రైతుబందు కమిటీ సభ్యుడు యాదయ్య, ఏఈఓ శ్రీవాణి, టీఆర్‌ఎ్‌స్‌ మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈజీఎస్‌ పనుల పరిశీలన

తలకొండపల్లి మండల పరిధిలోని కోరింతకుంట తండాలో ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పరిశీలించారు. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో భౌతిక దూరం పాటించి మాస్క్‌లు ధరించాలని సూచించారు.

ఆసుపత్రి సందర్శన

తలకొండపల్లి మండలం గట్టిప్పలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ సందర్శించారు. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్‌ పంపిణీని డాక్టర్‌ అజీమ్‌ను అడిగి తెలుసుకున్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు  సూచించారు. మే 1 నుంచి 18 సంవత్సరాలు నిండి ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జయమ్మ వెంకటయ్య, శరత్‌చంద్ర, చంద్రయ్య, శివ, వెంకటయ్య, జంగయ్య, మశ్చేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:07:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising