ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికి దృష్టి భాగ్యం

ABN, First Publish Date - 2021-10-19T05:05:42+05:30

ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికి దృష్టి భాగ్యం

నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న కండె ఓంకారం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమనగల్లు: ఒక్కరి నేత్రదానంతో ఇద్దరికి దృష్టి భాగ్యం కలుగుతుందని, మరణానంతరం ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలని లయన్స్‌క్లబ్‌ జిల్లా చైర్మన్‌ కండె ఓంకారం కోరారు. ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం అంధత్వ నివారణ సంస్థ సహకారంతో లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. క్లబ్‌ అధ్యక్షుడు జూలూరి రమేశ్‌, రీజియన్‌ చైర్మన్‌ ఎం.చంద్రశేఖర్‌, జిల్లా చైర్మన్‌ నటరాజ్‌ యాదయ్యలతో కలిసి ఓంకారం శిబిరాన్ని ప్రారంభించారు. కంటి వైద్యులు వెంకటస్వామి ఆధ్వర్యంలో 102మందికి కంటి పరీక్షలు నిర్వహించి 35 మందికి కంటి శుక్లాలు ఉన్నట్టు గుర్తించి 25మందిని ఐఓఎల్‌ ఆపరేషన్ల నిమిత్తం రాంరెడ్డి లయన్స్‌కంటి ఆస్పత్రికి తరలించారు. డాక్టర్‌ రవికుమార్‌, ఎంపీహెచ్‌ఈవో తిరుపతిరెడ్డి, కోశాధికారి వెంకట్‌, కార్యదర్శి వెంకటస్వామి, బాలకృష్ణ, పాషా, కర్నాటి కొండల్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, పాండురెడ్డి, రాంరెడ్డి, సూర్యప్రకాశ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-19T05:05:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising