ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ABN, First Publish Date - 2021-03-25T04:38:32+05:30

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

యాచారం : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధి మంతన్‌గౌరెల్లి గ్రామానికి చెందిన షేక్‌నవాజ్‌కు రూ.38వేలు, చింతపట్లకు చెందిన పోచయ్యకు రూ.32వేలు, కొత్తపల్లికి చెందిన వెంకటే్‌షకు రూ.22వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు మంజూరయ్యాయి. చెక్కులనందించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, టీఆర్‌ఎస్‌ నాయకులు చిన్నోళ్ల యాదయ్య, కె.రమే్‌షగౌడ్‌, మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

  • ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యం 

ఆమనగల్లు: అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి  అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన అర్జునయ్యకు రూ.16,500, దేవికి రూ.16వేలు, లాలునాయక్‌కు రూ.24వేలు, చావులీకి రూ.21 వేలు, దేవన్నకు రూ.26 వేలు, జంగయ్యకు రూ.56 వేలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం నగరంలోని తన నివాసంలో నారాయణరెడ్డి అందజేశారు. ఆయన మాట్లాడుతూ కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ అనిత, పుట్ట రాంరెడ్డి, రాజశేఖర్‌, నాయకులు వెంకటేశ్వర్‌రావు, రాములు, శంకర్‌నాయక్‌, కొండల్‌, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T04:38:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising