ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమాజ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

ABN, First Publish Date - 2021-10-19T05:16:02+05:30

సమాజ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి

సుతారిగూడలో బస్‌ షెల్టర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి మల్లారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మంత్రి చామకూర మల్లారెడ్డి


మేడ్చల్‌: సమాజ సేవకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ సుతారిగూడలో దాతల సహాయంతో నూతనంగా నిర్మించిన బస్‌షెల్టర్‌ను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో దాతల సహాయం అభినందనీయమన్నారు. అనంతరం రామాలయంలో గోపుర నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కౌన్సిలర్లు రజితావెంకటేశ్‌ముదిరాజ్‌, వీణాసురేందర్‌గౌడ్‌, బాలరాజు, పెంటయ్య, మల్లికార్జున్‌, కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌, రవికుమార్‌ పాల్గొన్నారు. 

అభివృద్ధికి పాటుపడాలి

మేడ్చల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం సమన్వయంతో అభివృద్ధికి పాటుపడాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. కండ్లకోయ పరిధిలో గల మేడ్చల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి రూ.4 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మార్కెట్‌ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్‌ కమిటీ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ రవియాదవ్‌, మాజీ చైర్మన్‌ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:16:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising