ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెనుకబడిన ఆలయాల అభివృద్ధికి కృషి

ABN, First Publish Date - 2021-01-22T05:58:03+05:30

వెనుకబడిన ఆలయాల అభివృద్ధికి కృషి

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని ఆశీర్వదిస్తున్న అర ్చకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాండూరు: టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం వెనుకబడిన ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం దేవస్థాయం ఈవో నరేందర్‌ ఎమ్మెల్యేను తాండూరులోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా పండితులు రోహిత్‌రెడ్డిని వేదమంత్రోచ్ఛరణలతో అశీర్వదించారు. అనంతరం ఎమ్మెల్యేతో ఈవో పలు విషయాలను చర్చించారు. రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 29న పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో నూతన మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. 


స్వీపర్‌ కాలనీ ఏర్పాటు చేయాలని వినతి 

తాండూరు మున్సిపల్‌ కార్మికులు తమకు స్వీపర్‌ కాలనీ కేటాయించాలని కోరుతూ గురువారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులకు 11వ పీఆర్సీ అమలు చేసేలా కృషి చేయాలని, విశ్రాంతి భవనం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులు వీరేశం, ప్రకాశం, శ్రీను, లాలప్ప, నరేష్‌, నర్సింహులు, అశోక్‌, వెంకటమ్మ, మల్లమ్మ, లక్షీమ, అనిత, యాదమ్మ తదితరులున్నారు.


సర్పంచులకు సన్మానం

తాండూరు రూరల్‌: మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచులు పదవి చేపట్టి రేండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే వారిని క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాములు, కార్యదర్శి నరేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్‌ రాంలింగారెడ్డి, సర్పంచ్‌లు బీడే నాగప్ప, లలిత, జగదీశ్వర్‌, గోవింద్‌, సాయిలు, ఎంపీటీసీ నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T05:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising