జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలు
ABN, First Publish Date - 2021-10-30T04:14:14+05:30
జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతుందని
- జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్) : జిల్లాలో ధరణి సమర్థవంతంగా అమలవుతుందని జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ అన్నారు. ధరణి పోర్టల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా డీఆర్‌వో, తహసీల్దారులతో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈసంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసమస్యల పరిష్కారం, ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ జిల్లాలో విజయవంతంగా అమలవుతుందని తెలిపారు. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని ట్యాంపర్ ప్రూఫ్‌గా ఉందన్నారు. వివక్షలేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్‌లో భూసంబం ధిత లావాదేవీలకు ధరణి నాన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుందని తెలిపారు. ధరణి ప్రారంభంతో రిజిస్ర్టేషన్ సేవలు ప్రజల ఇంటి వద్దకే చేరాయని తెలిపారు. నిషేధిత భూముల విషయంలో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు గ్రామాలవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నెలరోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు, ట్రైనీ కలెక్టర్ కదివరన్ ఫళని, డీఆర్‌వో హరిప్రియ, తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:14:14+05:30 IST