డ్రైవింగ్ శిక్షణ పొందేవారికి ఓఆర్‌ఆర్‌పై అనుమతి లేదు
ABN, First Publish Date - 2021-12-27T05:02:24+05:30
డ్రైవింగ్ శిక్షణ పొందేవారికి ఓఆర్‌ఆర్‌పై అనుమతి లేదు
- కుషాయిగూడ ట్రాఫిక్ సీఐ శ్రీనివాసరెడ్డి
ఘట్‌కేసర్ రూరల్ : కొత్తగా కారు విగ్ నేర్చుకునే వారికి అవుటర్ రింగురోడ్డు(ఓఆర్‌ఆర్)పై అనుమతి లేదని కుషాయిగూడ ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదివారం ఓ ప్రకనటలో తెలిపారు. అవుట్ రింగురోడ్డుపై కారు డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు కొత్తగా ఓఆర్‌ఆర్‌పై కారు డ్రైవింగ్ నేర్చుకునేవారికి అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, ప్రమాదాల నివారణకై నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Updated Date - 2021-12-27T05:02:24+05:30 IST