ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవంబరు 1న ముసాయిదా ఓటరు జాబితా

ABN, First Publish Date - 2021-10-30T04:16:54+05:30

నవంబరు 1న ముసా యిదా ఓటరు జాబితాను

మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : నవంబరు 1న ముసా యిదా ఓటరు జాబితాను ప్రచురించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు సంబం ధిత అధికారులను ఆదే శించారు. శుక్రవారం తన ఛాంబరులో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై అన్ని రాజకీయ పార్టీల ప్రతి నిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ 2022 కింద ఓటర్ల జాబితాలో సవరణలు, తొలగింపులు, మార్పులు, చేర్పుల వంటివి చేసి తుది ఓటరు జాబితాను ప్రచురించాలని తెలిపారు. కొత్త ఓటరు నమోదు, చనిపోయిన, ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల తొలగింపు, మార్పులు, చేర్పులపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను ప్రచురించాలన్నారు. ముసా యిదా ఓటరు జాబితాను అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, ఏమైనా సమస్యలు ఉంటే.. వాటిని నవంబర్‌ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి సరిచేయాలని తెలిపారు. 2022 జనవరి 5న తుది ఓటరు జాబితాను ప్రచురించాలని అధికారులకు సూచించారు. అదనపు పోలింగ్‌ స్టేషన్లు, లేదా పోలింగ్‌ కేంద్రాల మార్పు ఉన్నచోట రాజకీయ పార్టీల ప్రతినిధు లతో చర్చించి వారి సూచనలను తీసుకోవాలన్నారు. 2022 జనవరి 1 వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూ ర్తయిన యువతీ యువకులు ఆన్‌లైన్‌ ద్వారా లేదా ఫారం-6 ద్వారా కాని ఓటరు జాబితాలో తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకునే విధంగా చూడాలన్నారు. రాజకీయ పార్టీల వారీగా బూతు లెవల్‌ ఏజెంట్ల జాబితాను ఇవ్వాలని ఆదేశించారు. ముసాయిదా ఓటరు జాబితాను ప్రతుల రూపంలోనే ఇవ్వాలన్నారు.



Updated Date - 2021-10-30T04:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising