ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణాలతో చెలగాటం వద్దు

ABN, First Publish Date - 2021-06-22T05:24:34+05:30

ప్రాణాలతో చెలగాటం వద్దు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏఐబీఎ్‌సఎస్‌ జాతీయ కోశాధికారి భట్టు వెంకన్న

మేడ్చల్‌: కరోనా థర్ట్‌వేవ్‌ ప్ర మాదం పొంచి ఉందని నిపుణు లు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం జూలై 1 నుంచి పాఠశాలలు తెరిచే నిర్ణయాన్ని విరమించుకోవాలని, పి ల్లల ప్రాణాలతో చెలగాటం వద్దని ఆల్‌ ఇండియా బంజారా సేవా సమితి జాతీయ కోశాధికారి భట్టు వెంకన్న, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి నాగేశ్వర్‌రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం మేడ్చల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ థర్డ్‌వేవ్‌ పిల్లలపైనే ప్రమాదం అని వైద్యులు చెప్తున్నా బడులు తెరిచి విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దన్నారు. కరోనా మొదటి, సెకండ్‌ వేవ్‌లో కళ్లముందే ఎంతో మంది పిట్టల్లా రాలిపోతున్నా నిస్సహాయ స్థితిలో ఉండిపోయామని, మళ్లీ ఇప్పుడు పాఠశాలలు తెరుస్తామని ప్రకటించడంతో తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేపుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పరిశీలించి పరిస్థితులు చక్కబడే వరకు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు యథావిధిగా ఆన్‌లైన్‌ క్లాసులే కొనసాగించాలని పిల్లల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. పిల్లల ఆరోగ్యాన్ని, తల్లి దండ్రుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని ప్రభు త్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-06-22T05:24:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising